పోడూరు: పోడూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 5వ రోజుకు చేరింది.. ఈ సందర్భంగా
వి ఆర్ ఏ లకు మండల తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్, వీఆర్వోలు, ఆఫీసు సిబ్బంది వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు.
వీఆర్ఏల సహాయం నిరాకరణ ఉద్యమం 5వ రోజు చేరడంతో విఆర్వోలు వీఆర్ఏలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు ప్రకాశరావు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ, ఏళ్ల తరబడి గ్రామస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అర్హత, అనుభవం కలిగిన వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలనీ, పేస్కేల్ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించడంతోపాటు పదోన్నతులకుసంబంధించిన సమస్యలను పరిష్కరించాలనిచాలీచాలనీ, చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించడం వీఆర్ఏలకు కష్టంగా మారిందన్నారు.
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వీఆర్ఏల జీతాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ జీతాల కారణంగా వీఆర్ఏలు అనారోగ్యానికి గురైతే ఆసుపత్రి ఖర్చులు భరించలేని పరిస్థితి నెలకొందన్నారు.
ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను ఇకనైనా పట్టించుకుని న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరారు. ఉద్యమం చేస్తున్న తమకు సంఘీభావం తెలిపిన స్థానిక తహసిల్దార్ కు వీఆర్వోలకు సంఘం అధ్యక్షుడు ప్రకాశరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, కందుల రాంబాబు, డిప్యూటీ తహసీల్దారు కే వి వి సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ జి. కృపారాజు,
టైపిస్ట్ రాపాక సునీల్, వీఆర్వో శ్రీపాద కుమార్,
డీ యన్.వి. చలం, ఆర్ స్వామి, వి. వర్మ, కె. శ్రీనివాస్, సిహెచ్ శేఖర్, నాగమణి, జీవీఎస్ నాగరాజు, జీవీఎస్ బాబా, బి.ఇందిరా,బి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి