పాలకొల్లు: పాలకొల్లు-నరసాపురం రోడ్డులో బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు పాలకొల్లు నుంచి రాజోలు వెళుతున్న ఆర్టీసీ బస్సు .. నరసాపురం నుంచి భీమవరం వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ ను స్థానికులు 108 వాహనం ద్వారా పాలకొల్లు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పాలకొల్లు న్యూస్ - పాలకొల్లు తాజా వార్తలు, పశ్చిమగోదావరి జిల్లా వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు తెలుగులో.. 7330935849
పాలకొల్లులో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు
పాలకొల్లు: పాలకొల్లు-నరసాపురం రోడ్డులో బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు పాలకొల్లు నుంచి రాజోలు వెళుతున్న ఆర్టీసీ బస్సు .. నరసాపురం నుంచి భీమవరం వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ ను స్థానికులు 108 వాహనం ద్వారా పాలకొల్లు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వైయస్ జగన్ కు వివాహ శుభలేఖను అందించిన పాలకొల్లు ఇన్చార్జ్ గుడాల గోపి
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని
బుధవారం వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహర గోపాలరావు (గోపి) కుటుంబ సమేతంగా కలిసి కుమార్తె కోమలి శ్రీ విజయ దుర్గ - ప్రకాష్ రిసేష్షన్, వివాహ శుభలేఖ ను అందించి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులను కుటుంబ సమేతంగా ఆహ్వానించారు.
గల్ఫ్ వెళ్లిన తొలిరోజే గుండెపోటుతో మృత్యుఒడిలోకి.. తీవ్రశోకంలో కుటుంబం.. వద్దిపర్రు గ్రామంలో విషాదఛాయలు
వద్దిపర్రు: ఇద్దరు కూతుళ్ళ పెళ్లి చేయాలనీ.. కుటుంబ కష్టాలు తీర్చాలనీ.. ఎన్నో కలలతో గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి అక్కడ డ్యూటీలో జాయిన్ అయిన రోజే గుండెపోటుతో మృతి చెందిన దారుణమైన విషాద ఘటన ఇది. పోడూరు మండలం వద్దిపర్రు గ్రామానికి చెందిన నూకపెయ్యి సోమశేఖర్(48) తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేయాలనీ, కుటుంబ కష్టాలన్నీ తీర్చాలనే ఆశతో ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన గల్ఫ్ దేశమైన అబుదాబికి వెళ్లేందుకు ఇంటి వద్ద బయలుదేరి వెళ్ళాడు. సోమశేఖర్ అక్కడికి చేరుకున్నాక సెప్టెంబర్ 23వ తేదీన డ్యూటీలో చేరాడు. ఎన్నో కలలతో డ్యూటీలో చేరిన తొలి రోజే సోమశేఖర్ ను గుండెపోటు రూపంలో మృత్యువు వెంటాడింది.. అతని ఆశలన్నీ చిదిమేసింది. ఈ ఘటనతో వద్దిపర్రు గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. అక్టోబర్ 1వ తేదీన గురువారం సోమశేఖర్ భౌతిక కాయం స్వగ్రామానికి చేరుకుంటుందని కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. సోమశేఖర్ గ గల్ఫ్ వెళ్ళడం ఇదే తొలిసారి.. మొన్నటి వరకు అతను గ్రామంలోనే కూలి పనులకు, ట్రాక్టర్ డ్రైవర్ గా వెళ్తుండేవాడు. అతనికి భార్య, డిగ్రీ చదివిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాన్ని పలువురు గ్రామస్తులు, నాయకులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.
నిరసన ప్రదర్శనలో అస్వస్థతకు గురైన మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు
భీమవరంలో అస్వస్థతకు గురైన మాజీ ఎంపీ బాపిరాజు
భీమవరం:సర్ ప్రక్రియను ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా భీమవరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన నిరసన ప్రదర్శనలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రముఖ నేత కనుమూరి బాపిరాజు అస్వస్థతకు గురై కళ్ళు తిరిగి పడిపోయారు. సర్ పక్రియను రద్దు చేయాలని సిఇసి జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలనీ భీమవరంలో జరిగిన ప్రదర్శన లో బాపిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎండ తీవ్రంగా ఉండడంతో బాపిరాజు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారాం , కాంగ్రెస్ నాయకులు, సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ తదితరులు ఆయనను కారులోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. కొంత సమయం సేద తీరిన తర్వాత ఆయన కోలుకున్నారు.
రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డుకు ఎంపికైన ఆచంట సీ హెచ్ సీ
సత్ఫలితాలనిచ్చిన జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి మార్గదర్శకాలు
ఆచంట:ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రం( సీ హెచ్ సీ) రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డుకు ఎంపికైంది. ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చూపిన ప్రత్యేక చొరవ, మార్గదర్శకాలు సత్ఫలితాలను అందించాయి. గతంలో ఆసుపత్రిని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగులకు మెరుగైన సౌకర్యాలు, పారిశుధ్య ప్రమాణాల పెంపుపై ఆసుపత్రి అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేశారు. కలెక్టర్ సూచనలను స్ఫూర్తిగా తీసుకొని ఆసుపత్రి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పలు అభివృద్ధి చర్యలు చేపట్టారు. స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఆసుపత్రి పరిసరాలు, వార్డులు, మరుగుదొడ్లు, వ్యర్థాల నిర్వహణ, రోగులకు అందించే సౌకర్యాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో, ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రం సాధించిన ఈ గుర్తింపు జిల్లాకు గర్వకారణంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర ఆసుపత్రులు కూడా ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రం ను స్ఫూర్తిగా తీసుకొని పారిశుధ్య నిర్వహణలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకాంక్షించారు.
వల్లూరులో జనసేన ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణి
వల్లూరులో జనసేన ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి
ఆచంట:ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతీనెల చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా బుధవారం 10 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు కడిమి ఉమా మహేశ్వరస్వామి ఆధ్వర్యంలో గత 13 నెలలు నుండి వల్లూరు గ్రామంలోని జనసైనికుల ఆర్థిక సహాయంతో వల్లూరు గ్రామంలో ప్రతీ నెలా 10 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెల ఈ కార్యక్రమానికి సహకరించి ప్రోత్సాహమిస్తున్న జన సైనికులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో వల్లూరు గాంధీ నగర్ కు చెందిన నెలల వయసున్న బాబుకి వైద్య ఖర్చులు నిమిత్తం జనసేన నాయకులు ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో వల్లూరు సొసైటీ అధ్యక్షులు తోట ఆదినారాయణ, జనసేన నాయకులు పంపన శ్రీనివాస్, ఏడిద ఆదినారాయణ, తాళం రమేష్, చిటకన సుబ్బారావు, నారిన రాంబాబ పాల్గొన్నారు.
భీమవరం నటరాజ్ థియేటర్ వద్ద పేలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
భీమవరం నటరాజ్ థియేటర్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు వ్యాపిస్తున్న దృశ్యం
భీమవరంలోని నటరాజ్ థియేటర్ వద్ద వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలి అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రజలు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో ఎవరికీ ఏమి కాకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు
పారిశుధ్య కార్మికులకు స్వచ్ఛత హి కార్యక్రమం లో భాగంగా బుధవారం పోడూరు పీహెచ్ సీ లో వైద్య పరీక్షలు వైద్యాధికారి డా ఎస్ శ్రీ వాసవి, సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పోడూరు డిప్యూటీ ఎంపీడీవో పడాల నాగిరెడ్డి, పంచాయితీ కార్యదర్శులు చిట్టాల ఫణికుమార్, వెంకటలక్ష్మి, ఐ బాలాజీ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె బి కె ఎస్ రమేష్ రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి జె సత్యనారాయణ, పి హెచ్ ఎన్ ఎస్ మీరమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు సిహెచ్ఎస్వీఎల్ పద్మ కుమారి, హెల్త్ అసిస్టెంట్ లు జి అమ్మిరాజు, జే శ్రీనివాస్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
8k రన్ లో జిల్లా కలెక్టర్ సీ హెచ్ నాగరాణి
గంజాయి నిర్మూలించండి.. యువతను కాపాడండి .. నినాదంతో మార్టేరు నుండి ఆచంట వరకు బుధవారం మార్టేరు బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 8k రన్ లో జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి , మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొని యువతకు, సమాజానికి సందేశాన్నిచ్చారు
వైసీపీ అభిమాని పార్వతమ్మను పరామర్శించిన జోగాడ, మల్లికార్జునుడు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసిపి అభిమాని పార్వతమ్మ ను పరామర్శిస్తున్న జోగాడ ఉమామహేశ్వరరావు, వీరా మల్లికార్జునుడు
పాలకొల్లు:పోడూరు మండలం రావిపాడు గ్రామానికి చెందిన వైసీపీ అభిమాని వాసా పార్వతమ్మ అనారోగ్యానికి గురై పాలకొల్లు సౌమ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన స్వగ్రామానికి చెందిన వైసీపీ అభిమాని పార్వతమ్మ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి బుధవారం వైసీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు, మాజీ వార్డు సభ్యులు వీరా మల్లికార్జునుడు రాహుల్ సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు, వైసీపీ జిల్లా ఉపాద్యక్షులు జోగాడ ఉమామహేశ్వరరావుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి పార్వతమ్మను పరామర్శించారు.
మార్టేరు లో 8K రన్‌ను ప్రారంభించిన ఆచంట ఎమ్మెల్యే ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
మార్టేరు:
గంజాయి నిర్మూలించండి.. యువత భవిష్యత్తును కాపాడండి.. నినాదంతో గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలనే సందేశంతో మార్టేరు నుంచి ఆచంట ఏఎంసి వరకు బుధవారం మార్టేరు బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8k రన్ ను చేపట్టారు. మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మార్టేరులో ఈ 8k రన్ ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, జిల్లా అడిషనల్ ఎస్పీ విశ్వనాధ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అక్టోబర్ 2న దగ్గులూరులో చేనేత కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలి..--చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చల్లా వీరభద్రుడు
దగ్గులూరు లో చేనేత కార్మికుల సంఘ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు చల్లా వీరభద్రుడు
పాలకొల్లు:చేనేత సమస్యలు పరిష్కారాని కై అక్టోబర్ 2న పాలకొల్లు మండలం దగ్గులూరు లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా వీరభద్రుడు పిలుపునిచ్చారు. పాలకొల్లు మండలం దగ్గులూరు లో సెప్టెంబర్29 వ తేదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు చల్లా వీరభద్రుడు హాజరయ్యారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దగ్గులూరు గాంధీ విగ్రహం వద్ద జరిగే ధర్నాలో కార్మికులు, నాయకులు, చేనేతాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేయవలసిందిగావారు కోరారు.
కవిటం జడ్పీ హైస్కూలు ఎస్ఎంసీ ఛైర్మన్ గా కవిటం వెంకట పుల్లారావు, వైస్ చైర్మన్ గా దేవి
కవిటం జడ్పీ హైస్కూల్లో నూతన ఎస్ఎంసి కమిటీకి అభినందనలు తెలుపుతున్న సొసైటీ చైర్మన్ ఊడిగ శ్రీనివాసరావు, గ్రామ టిడిపి అధ్యక్షులు గుబ్బల అప్పన్న స్వామి తదితర నాయకులు
కవిటం: కవిటం జిల్లా పరిషత్ హైస్కూలుకు మంగళవారం జరిగిన ఎస్ఎంసీ ఎన్నికలో ఛైర్మన్ గా కవిటం వెంకట పుల్లారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ గా జగ్గురోతి దేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన ఎస్ఎంసి కమిటీకి కవిటం సొసైటీ చైర్మన్ ఊడిగ శ్రీనివాసరావు, గ్రామ టిడిపి అధ్యక్షులు గుబ్బల అప్పన్న స్వామి, షేక్ అబ్దుల్ రజాక్, పిల్లా చిరంజీవి, బొక్కా శ్రీనివాస్, దొంగ గవరయ్య, బూరాబత్తుల దుర్గాప్రసాద్, హైస్కూల్ హెచ్ఎం ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు బి శేషగిరిరావు, వెంకటరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.
''ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త” లక్ష సాధనకు అర్హులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలి..--జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి
జిల్లా కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో డీఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, బ్యాంకర్లు తదితర శాఖల జిల్లా అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి
భీమవరం:"'ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా, స్వయం ఉపాధి పొందే వ్యక్తిగా తీర్చిదిద్దే దిశగా వివిధ పథకాల ద్వారా ప్రోత్సాహం అందిస్తోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అర్హులైన ఔత్సాహికులకు రుణాలు సకాలంలో మంజూరు చేసి, వారు తమ వ్యాపారాలను ప్రారంభించేలా బ్యాంకర్లు, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో డీఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, బ్యాంకర్లు తదితర శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (పీఎంఎఫ్ఎంఈ), పీఎం స్వనిధి, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన తదితర పథకాల అమలు ద్వారా ఔత్సాహికులకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధన, పెండింగ్ దరఖాస్తులు, గ్రౌండింగ్ తదితరా అంశాలపై సమీక్షించారు. డీఆర్డిఏ పిడి ఎం.ఎస్.ఎస్ వేణుగోపాల్, పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతి, డిపిఎం ఆర్ కుసుమకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి సునీత, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యం వి జాన్ మార్టిన్, మెప్మా అధికారి హెబ్సిబా, జిల్లా చేనేత జౌలి శాఖ అధికారి కె అప్పారావు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ''పల్లె పండుగ 3.0''
గొల్లలకోడేరు గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృదిద్దే లక్ష్యంగా ప్రభుత్వం ''పల్లెపండుగ'' కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో వికసిత్ భారత్ జి రాం జి నిధులతో రెండు చోట్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఉప సభాపతి రఘు రామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రఘు రామకృష్ణరాజు మాట్లాడుతూ పల్లె ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన రహదారి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, గోకులాల నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక కార్యకలాపాలకు అవసరమైన వసతుల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ కార్యక్రమం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా స్థానిక అవసరాలను గుర్తించి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని అన్నారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ప్రాధాన్యతా క్రమంలో పనులను చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలిపారు. చేపట్టిన పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలనన్నారు. జిల్లాలో పల్లె పండుగ 3.0 కింద చేపట్టే పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డ్వామా పిడి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అరుణకుమారి, పంచాయతీరాజ్ ఏఈ విజయకుమార్ రాజు, పంచాయతీ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు, జీతాలు ఇవ్వకపోవడం దారుణం
--అధికారులపై మాల మహానాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ధ్వజం
ఆచంట: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు బిల్లులు, జీతాలు చెల్లించకపోవడం చాలా దారుణమని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంట వేమవరం జిల్లా పరిషత్ హై స్కూలులో మంగళవారం భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరు తో ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం పథకం అమలుచేయడం మంచి నిర్ణయమన్నారు. అయితే ప్రభుత్వం బియ్యం, గుడ్లు సరఫరా చేసి మిగతా సరుకులకు నెలవారీగా బిల్లులు చెల్లించాల్సి ఉందనీ, గత ఏప్రిల్ నుండి భోజన పథకం నిర్వాహకులకు బిల్లులు, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని పుష్పరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు, జీతాలు చెల్లింపులో తీవ్ర జాప్యం వల్ల భోజనం పథకం నిర్వాహకులు తమ బంగారం తాకట్టు పెట్టో, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చో భోజన పథకం ను ఆగకుండా కొనసాగించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఏ రోజు ఆపకుండా చాలా అంకితభావంతో ప్రభుత్వ ఆశయాన్ని ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ఇదే విషయాన్ని భోజన పథకం నిర్వాహకులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు అనేకసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఒకపక్క భోజనం పథకం నిర్వాహకులు ఎన్నో వ్యయ ప్రయాసలు పడి భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేస్తూ, ప్రభుత్వ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ప్రభుత్వాధికారులు మాత్రం జీతాలు, బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం వహిస్తున్నారనీ, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి భోజన పథకం నిర్వాహకులకు జీతాలు, బిల్లులు చెల్లించాలని పుష్పరాజ్ డిమాండ్ చేశారు. లేకుంటే భోజనం పథకం నిర్వాహకులకు జీతాలు, బిల్లులు చెల్లించే వరకు మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కోలాటి ప్రసాదరావు, పలువురు కమిటీ సభ్యులు పుష్పరాజ్ వెంట ఉన్నారు.
పోడూరులో 14వ రోజు వీఆర్ఏల వంటావార్పు తో నిరసన
పోడూరు:
సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా పోడూరు తాహసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు 14వ రోజు వంటవార్పు కార్యక్రమంతో తమ నిరసన వ్యక్తం చేశారు. మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు బెల్లాని ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు సూర్యనారాయణ, మండలంలోని విఆర్ఏలు వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసురెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జోగాడ
పాలకొల్లు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా నియమితులైన సందర్భంగా పెనుమంట్ర తాజా మాజీ ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి(వాసురెడ్డి) ని మంగళవారం పాలకొల్లు రాహుల్ సామాజిక సేవా సంస్థ వృద్దాశ్రమం అధినేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జోగాడ ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. వాసురెడ్డిని దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి జోగాడ శుభాకాంక్షలు తెలిపారు. జోగాడ తో పాటు వైసీపీ జిల్లా చేనేత విబాగం అద్యక్షులు వీరా మల్లికార్జునుడు వాసురెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
మార్టేరులో ఉత్సాహంగా వినాయక నిమజ్జనోత్సవం... భారీ సంఖ్యలో తిలకించిన ప్రజలు
మార్టేరు:
మార్టేరు గ్రామ జగనన్న కాలనీలో స్థానిక ప్రజలు శ్రీ జ్ఞానేశ్వర వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా జగనన్న కాలనీ నుండి వినాయక నిమజ్జన ఊరేగింపు ను మంగళవారం ఘనంగా జరిపారు. డోలు, తీన్మార్, గరగలు తో సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపు నిర్వహించారు. మార్టేరు సెంటర్లో వంతెన పైనుండి జేసీబీ సహాయంతో శ్రీ విగ్నేశ్వర స్వామి వారిని కమిటీ సభ్యులు నిమజ్జనం చేశారు. అత్యంత ఉత్సాహంగా, ఉద్వేగ భరితంగా సాగిన వినాయక నిమజ్జనోత్సవాన్ని వందలాది భక్తులు తిలకించారు.
ఉదయగిరి బత్తాయి రైతులకు వెలుగొండ వరప్రసాది.. --రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు
అమరావతి:
ఉదయగిరి బత్తాయి రైతులకు వెలుగొండ వరప్రసాది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1 ద్వారా నల్లమల సాగర్ కు నీటిని తీసుకొచ్చామనీ, దీని ఆధారిత ఈస్టర్న్ మెయిన్ కెనాల్ వల్ల ఉదయగిరి ప్రాంత బత్తాయి తోటలకు మరియు భూగర్భ జల మట్టాల పెరుగుదలకు విశేష ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు తగ్గిన తమ బత్తాయి తోటలకు వెలుగొండ ప్రాజెక్ట్ నిజమైన కల్పతరువుగా మారిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి నిమ్మల హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సూపర్ ఎల్ నినో వంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు తరలించి, ప్రస్తుతం 7 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని మంత్రి నిమ్మల తెలిపారు.
వైసీపీ జాయింట్ సెక్రెటరీ కర్రి వాసురెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాసరాజు
పెనుమంట్ర:
వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా నియామకమైన సందర్భంగా పెనుమంట్ర తాజా మాజీ ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి) ను పెనుమంట్ర వైసీపీ నాయకులు భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాసరాజుతో పాటు గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు వాసురెడ్డికి శుభకాంక్షలు తెలిపారు.
ఈ చలాన్లు కట్టకపోతే ఆ సొమ్ము విద్యుత్ బిల్లులకు జోడించండి.. --సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ:
నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ఈ చలాన్లు చెల్లించకపోతే ఆ సొమ్మును విద్యుత్ బిల్లులో చేర్చాలని సుప్రీంకోర్టు కొరడా ఝళి పించింది. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతకు గాను వాహనదారులు, చోదకులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇప్పటివరకూ ఈ-చలాన్ల రూపంలో విధించిన జరిమానాల్లో ఇంకా రూ.20వేల కోట్ల వసూలు కాని విషయాన్ని గుర్తు చేస్తూ కఠిన చర్యలకు ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై 2012లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రూ.45వేల కోట్ల విలువైన చలానాలు జారీచేయగా ఇప్పటివరకు రూ.25వేల కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు కోర్టు సహాయకుడు(అమికస్ క్యూరీ) తెలిపిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. • ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలకు జారీ అయిన చలాన్లను నెలవారీ విద్యుత్తు బిల్లులో చేర్చి వసూలుచేయాలని ఆదేశించింది. విద్యుత్తు బిల్లు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరా కట్ చేస్తారు కాబట్టి జరిమానా కచ్చితంగా చెల్లిస్తారని అభిప్రాయపడింది. • ఈ-చలానా బకాయిలు చెల్లించని వాహనాలకు ఆన్లైన్ సేవలైన ఆర్సీల పునరుద్ధరణ, డూప్లికేట్ ఆర్సీల జారీ, యజమాని చిరునామా అప్డేషన్ లాంటి సేవలు నిషేధించాలనీ, ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా వాహన స్వాధీనానికి చర్యలు తీసుకోవాలనీ, ఎక్కువసార్లు ఉల్లంఘనలకు పాల్పడిన వారి డ్రైవింగ్ లైసెన్స్/రెన్యూవల్‌ను రద్దు చేయాలనీ ధర్మాసనం సూచించింది.
చంద్రరావు కుటుంబానికి ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ పరామర్శ
యలమంచిలి:
యలమంచిలి మండలం లక్ష్మిపాలెం గ్రామానికి చెందిన మొల్లేటి చంద్రరావు ఇటీవలే స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్సీ, రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షులు కవురు శ్రీనివాస్ సోమవారం చంద్రరావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తో పాటు వైసీపీ మండల కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్ , మాజీ ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవి ,గ్రామ మాజీ సర్పంచ్ ఘాటిగంటి మహేష్ , గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లాడి ఏడుకొండలు, మాజీ సర్పంచ్ లు వల్లభు నరసింహారావు , కవురు గోపి ,మాజీ ఎంపీటీసీ ఏడుకొండలు తదితరులు చంద్రరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు.
మా గోడు వినిపించుకోండి.. ప్రభుత్వానికి చెప్పండి... ఆచంట ఎమ్మెల్యే పితానికి వీఆర్ఏల మొర
ఆచంట:
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆచంట నియోజకవర్గం లోని వీఆర్ఏలు రాష్ట్ర మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆచంట నియోజకవర్గంలోని ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు మండలాలకు చెందిన వీఆర్ఏలంతా సోమవారం కొమ్ముచిక్కాల లో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించలేకపోతున్నామనీ, ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. పే స్కేలు, పదోన్నతులు లేవని వీఆర్ఏలంతా ఎమ్మెల్యే పితాని వద్ద తమ గోడు వినిపించుకున్నారు.
వైసీపీ నేత మురళీకృష్ణంరాజును పరామర్శించిన జోగాడ, తాతాజీ
వైసీపీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజు ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకొని పాలకొల్లు రాహుల్ సామాజిక సేవా వృద్ధాశ్రమం అధినేత, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు జోగాడ ఉమామహేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర పార్లమెంటరీ విభాగం కార్యదర్శి యడ్ల తాతాజీ వైసీపీ ప్రముఖ నేతలు, నాయకులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయనను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జోగాడ, తాతాజీ తో పాటు వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం సంయుక్త కార్యదర్శి మామిడిశెట్టి చిట్టిబాబు, వైసీపీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు వీరా మల్లికార్జునుడు, జిల్లా అధికార ప్రతినిధి ప్రసాదుల రాము, వైసీపీ నాయకులు పిల్లా అప్పాజి, రావి పృద్వీరాజ్ తదితరులు మురళీకృష్ణంరాజును పరామర్శించడానికి వెళ్లిన వారిలో ఉన్నారు.
ఆచంట నియోజకవర్గం లో రాజుకుంటున్న రాజకీయ వేడి.. వైసీపీ నాయకులకు పై అక్రమ కేసులు పెడుతున్నారంటూ పార్టీ నేత, తాజా మాజీ జడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు మండిపాటు
ఆచంట:
ఆచంట నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మాజీ జడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు ఆరోపించారు. తూర్పుపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్యులపై తీవ్ర స్థాయి కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజును నేరుగా ఎదుర్కోలేక ఆయన అనుచరులు, మాజీ సర్పంచ్ సుంకర సీతారాం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందని చట్టాలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆచంట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని, మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ప్రతిష్ఠను దెబ్బతీయలేరని గుంటూరు పెద్దిరాజు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ బలాన్ని ప్రజల ముందు నిరూపించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పెనుమంట్ర తాజా మాజీ ఎంపీపీ కర్రి వాసురెడ్డి, తాజా మాజీ జెడ్పిటిసి కర్రీ గౌరీ సుభాషిని తదితర నేతలు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి జీతాలా..? --మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్ మండిపాటు
ఆచంట:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన గురించి ప్రజలు చెప్పాలి గానీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవడం చాలా సిగ్గుచేటని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆచంట వేమవరం మాల మహానాడు కార్యాలయం లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తే ప్రజలే ప్రచారం చేస్తారన్నారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలపై, సొంత మీడియాపై నమ్మకం లేక ప్రచార ఆర్భాటాలకు సోషల్ మీడియా కు కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము ఇస్తామంటే రాష్ట్రంలో ప్రజలెవరూ చూస్తూ ఊరుకోరన్నారు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు అడిగినట్లుగా చంద్రబాబు తీరు ఉందని పుష్పరాజ్ ఎద్దేవా చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1500 వందలు రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చెయ్యలేదనీ, నిరుద్యోగి భృతి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. చాలీ చాలని జీతాలతో సచివాలయం సిబ్బంది ఆందోళన చేస్తుంటే కనీసం వాళ్ళతో మాట్లాడకుండా పోలీస్ వారితో లాఠీఛార్జీ చేయించడం చాలా అమానుష చర్యన్నారు. దళిత వాడల్లో కనీస సదుపాయాలు లేవనీ, గ్రామాలకు మంచి నీరు కూడా ఇవ్వలేకపోతున్నారనీ, రాష్ట్రంలో ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీరు కొనుగోలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు. చేనేత కార్మికుల కు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి సవాలక్ష ఆరాలు పెట్టీ ఎవరికీ అర్హత లేకుండా చెయ్యటం చేనేత కార్మికుల సంక్షేమాన్ని నీరుగార్చడమేనని పుష్పరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏదో గొప్ప పని చేసినట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రచారం చేయించుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. చంద్రబాబు సొంతడబ్బా ప్రచారం చేయించుకోవాలనుకుంటే పార్టీ నిధులు ద్వారా చేయించుకోవాలనీ, ప్రజా సొమ్మును దోచిపెడితే ప్రజలందరూ కలిసి రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారని పుష్ప రాజ్ హెచ్చరించారు.
పేద రోగులకు సీఎంఆర్ఎఫ్ వరం -- ఆచంట ఎమ్మెల్యే పితాని
కొమ్ము చిక్కాల:
పేద రోగులకు సీఎంఆర్ఎఫ్ వరమని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్న పలువురు పేద రోగులకు కొమ్ముచిక్కాల లో ఎమ్మెల్యే పితాని సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపేట వేస్తున్నారన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రుద్రరాజు రమేష్ రాజు, కవిటం సొసైటీ అధ్యక్షులు ఊడిగ శ్రీనివాసరావు, బూత్ కన్వీనర్ బూరాబత్తుల దుర్గాప్రసాద్, పోడూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు బొంతు కాశీ, టీడీపీ నాయకులు రుద్రరాజు రవిరాజు, బొక్కా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు.. -- జిల్లా వైద్య శాఖ అధికారి డా. సి హెచ్ వి భారతలక్ష్మి
భీమవరం:
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిహెచ్ వి భారతలక్ష్మి అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేయాలనీ, అక్కడ ఉన్న రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించాలనీ అధికారులను ఆదేశించారు. అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిని పట్టుకోవడానికి క్రమం తప్పకుండా స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించాలనీ, జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేలా గోడ పత్రికలు, హోర్డింగులు లేదా ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేసినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పి.సి.పి.ఎన్.డి.టి చట్టం 1994, నిబంధనలు 1996 ప్రకారం స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇలాంటి అసాంఘిక విధానాలను ఎవరూ ప్రోత్సహించకూడదని, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రోగనిరోధక శాఖ అధికారి డాక్టర్ దేవసుధాలక్ష్మి, డాక్టర్ ఎం. సుబ్బలక్ష్మి, డాక్టర్ కె. ప్రవీణ్ కుమార్, డిప్యూటీ డెమో రాజా అక్కులు, డీ వై హెచ్ఈ వి.ఎస్.ఆర్.కె. కుమారి, ఎం పి హెచ్ ఇ ఓ తదితరులు పాల్గొన్నారు.
నిర్ణీత గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించాలి. ---జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,
భీమవరం:
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతీ ఫిర్యాదు పై తక్షణమే స్పందించి నిర్ణీత గడువు లోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ పి.గ్లోరియా, కలెక్టరేట్ కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ బి. పెంచల ప్రభాకర్, పిజిఆర్ఎస్ జిల్లా ప్రత్యేక అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షిస్తూ, ప్రజలు తమ సమస్య పరిష్కారం కోసం పదేపదే కార్యాలయాలు చుట్టూ తిరగకుండా పి జి ఆర్ ఎస్ లో నమోదయ్యే ప్రతీ ఫిర్యాదును సంబంధిత అధికారులు బాధ్యతగా తీసుకొని ఫిర్యాదుదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షించి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి
భీమవరం:
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం భీమవరంలోని ఏఆర్కేఆర్ ఎం.పి.ఎల్. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి పాల్గొని విద్యార్థులకు స్వయంగా నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమనీ, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రతను పాటించడంతో పాటు నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నులి పురుగులు ఎలా ఏర్పడతాయి..వాటి వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. భోజనం చేయడానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సి. భారత లక్ష్మి, జిల్లా నులిపురుగుల నిర్మూలన వైద్యాధికారి డాక్టర్ వి. క్రాంతి కుమార్ , జిల్లా విద్యాశాఖ అధికారి ఓ.వి.ఎస్. అనిల్ కుమార్, మారుతినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎ. సుమా, మండల విద్యాశాఖ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేసిన వైద్యాధికారులు
పోడూరు:
నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పోడూరు పీహెచ్ సీ వైద్యాధికారి డా ఎస్ శ్రీ వాసవి, గుమ్మలూరు పీహెచ్ సీ వైద్యాధికారి డా జి మణిత్యాగి సోమవారం తమ పరిధిలోని జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల కు మాత్రలు వేశారు. ఈ సందర్భం గా వైద్యాధికారులు మాట్లాడుతూ కలుషిత నీరు, శుభ్రం చేయని కూరగాయలు, గోర్లు కొరకడం, చెప్పులు లేకుండా నడవడం, బహిరంగ మల విసర్జన ద్వారా నులిపురుగులు వస్తాయన్నారు. నులిపురుగులు ఉన్న వారి లో కడుపు నొప్పి, వికారం ఆకలి లేకపోవడం లేదా బాగా ఆకలి వేయడం బరువు తగ్గడం, నీరసం గా ఉండటం రక్తహీనత లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో పోడూరు కల్నల్ డి ఎస్ రాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానఉపాధ్యాయులు జి సత్యనారాయణ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె బి కె ఎస్ రమేష్ రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి జె సత్యనారాయణ, పి హెచ్ ఎన్ ఎస్ మీరమ్మ ,ఆరోగ్య పర్యవేక్షకులు సిహెచ్ఎస్ విఎల్ పద్మ కుమా,రి సిబ్బంది పాల్గొన్నారు.
ఉన్నత చదువులే సుస్థిరమైన భవిష్యత్తుకు పునాది
జిన్నూరు:
ఉన్నత చదువులే సుస్థిరమైన భవిష్యత్తుకు పునాదని పాలకొల్లు జై భీమ్ సేవాసమితి (జేబీఎస్) గౌరవాధ్యక్షులు, రిటైర్డ్ తాహసిల్దార్ మానుకొండ సత్యనారాయణ అన్నారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన కాటం చంద్రిక, కాటం సుజన చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. చంద్రిక భీమవరం విష్ణు కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్, సుజన పాలకొల్లు విశ్వ కళాశాలలో ఫస్ట్ ఇయర్(ఎంసెట్) చదువుతున్నారు. సుజన 10వ తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించింది. కాగా వీరి తండ్రి కాటం శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వీరి కుటుంబం జీవనాధారం లేక కష్టాల్లో పడింది. వీళ్ళ పరిస్థితి తెలిసి పాలకొల్లు జై భీమ్ సేవా సంస్థ (జేబీఎస్) మానవతా హృదయంతో స్పందించింది. కుటుంబ కష్టాల వల్ల చంద్రిక, సుజన ల ఉన్నత చదువులకు ఆటంకం కలగకూడదనే లక్ష్యంతో జేబీఎస్ సభ్యులు సోమవారం వారి నివాసానికి వెళ్లి తమ సంస్థ తరఫున రూ.25వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా జేబీఎస్ గౌరవాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ చదువులో ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులను ప్రోత్సహించడమే జేబీఎస్ ప్రధాన ఆశయమన్నారు. దాదాపు 18 ఏళ్లుగా జేబీఎస్ ద్వారా పాలకొల్లు నియోజకవర్గం లోని పలుగ్రామాల్లో పేద విద్యార్థులకు, పేద రోగులకు ఆర్థికసాయం చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పటికీ అధైర్య పడకుండా చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిస్తున్న కాటం చంద్రిక, కాటం సుజన లకు దాతలు, సేవా సంస్థలు ముందుకువచ్చి సాయం అందించాలని పిలుపునిచ్చారు. జేబీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మైలాబత్తుల రాజశేఖర్, చింతా సంపత్ లు మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో పేదరికం నిర్మూలన అవుతుందన్నారు. ఈ రోజుల్లో పేద విద్యార్థులకు సాయం అందించడానికి అనేకమంది దాతలు, సేవా సంస్థలు సిద్ధంగా ఉన్నారనీ, కాబట్టి పేద విద్యార్థులు అధైర్య పడకుండా, ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ చదువును మధ్యలో ఆపకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులంతా చిన్ననాటి నుంచే చదువుపై దృష్టి సారించి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేబీఎస్ సభ్యులు కోలాటి విజయ్ కుమార్, మదన్ మోహన్ జీ, జనార్ధనరావు, ఆర్ కృష్ణమూర్తి, డి.క్షేమమూర్తి, ఎంవీ రాజశేఖర్, వి. రవీంద్ర కుమార్ ఎం. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలి..--పోడూరులో 13వ రోజుకు వీఆర్ఏల నిరవధిక సమ్మె
పోడూరు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు బెల్లాని ప్రకాశరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని వీఆర్ఏలు 13 రోజు జిలే నిరాహార దీక్ష కొనసాగించారు. దీక్షలో పాల్గొన్న సంఘం అధ్యక్షులు ప్రకాశరావు మాట్లాడుతూ అర్హులైన వీఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలనీ, రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్లన్నీ పరిష్కరించాలన్నారు. రిలే నిరాహార దీక్షలో సంఘం ఉపాధ్యక్షులు సూర్యనారాయణ , మండలంలోని వీఆర్ఏలు పాల్గొన్నారు.
జనసేనకు ప్రాధాన్యత కల్పించటం అభినందనీయం
పోడూరు:
సొసైటీల త్రిసభ్య కమిటీల నియామకంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సమతుల్యం పాటించి జనసేనకు ప్రాధాన్యత కల్పించడం ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనం వెంకట నరసయ్య (చినబాబు) అన్నార. వేడంగిపాలెం త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా లంకలపల్లి రవీంద్రప్రసాద్, సభ్యులుగా కొండేటి ప్రసాద్, గుడాల శివప్రసాద్ ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ మాట్లాడుతూ సొసైటీ ద్వారా రైతులకు విస్తృత సేవలు అందించి సొసైటీను లాభాల బాటలో నడిపించాలని పిలుపునిచ్చారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ లంకలపల్లి రవీంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సొసైటీ ద్వారా రైతులకు విలువైన సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మండల కార్యదర్శి శీలం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కూటమి నాయకులు గొట్టుముక్కుల సూర్యనారాయణరాజు, దాసరి రత్నరాజు, జక్కంపూడి కుమార్, రుద్రరాజు రమేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆనందబాబును నరసాపురం ఎంపీడీవో గా నియమించాలి.. యర్రంశెట్టి వారి పాలెం మాజీ సర్పంచ్ కూనపరెడ్డి
నరసాపురం:
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సచివాలయాల పనితీరులో నరసాపురం మండల సచివాలయాలు 31 వ స్థానం సాధించినట్లు మండల సచివాలయాల అధికారి , డిప్యూటీ ఎంపీడీవో ఆనందబాబు తెలిపారు. ఈ సందర్భముగా ఆదివారం ఆయనను ఆయన స్వగృహంలో యర్రంశెట్టి వారిపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, మండల సర్పంచ్ ల ఛాంబర్ మాజీ అధ్యక్షులు కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ఆనందబాబును నరసాపురం ఎంపీడీవో గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని క్రింది స్థాయి అధికారులు కూడా ప్రజలకు సచివాలయాల ద్వారా తమ సేవల అందించి రాష్ట్ర ప్రభుత్వానికి, సచివాలయ వ్యవస్థకు మంచి పేరు తీసుకొస్తారన్నారు.
చేకూరి సూరిబాబుకు వైసీపీ నేత యడ్ల తాతాజీ పరామర్శ
పోడూరు:
పోడూరు గ్రామ ప్రముఖులు వైసీపీ నాయకులు చేకూరి సూరిబాబును సోమవారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీ పరామర్శించారు. సూరిబాబు తండ్రి, ఆచంట మాజీ ఏఎంసి మాజీ చైర్మన్ రామకృష్ణంరాజు ఇటీవల స్వర్గస్తులయ్యారు. రామకృష్ణంరాజు చిత్రపటానికి తాతాజీ పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. వైసీపీ నాయకులు పిల్లా అప్పాజీ, రావి పృధ్విరాజ్, ప్రసాద్ తదితరులు తాతాజీ వెంట ఉన్నారు.
వైకల్యం చదువుకు అడ్డంకి కాకూడదు.. వైకల్యం ఉందని చదువు మధ్యలో ఆపొద్దు... --జిల్లా కలెక్టర్ నాగరాణి
భీమవరం:
వైకల్యం చదువుకు అడ్డంకి కారాదని, ఎట్టి పరిస్థితి లోనూ చదువును మధ్యలో ఆపకూడదని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
భీమవరంలోని డి.ఎన్.ఆర్. కాలేజీ శ్రీ రామకృష్ణ సభా మందిరంలో వికలాంగులు, ట్రాన్స్జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పశ్చిమ గోదావరి జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ (సాంకేతిక భాష) దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
సమాజంలో బధిరులకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం, సాంకేతిక (సైన్) భాష ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ రోజు తమతో గడపడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. అంతర్జాతీయ బధిరుల వారోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలోని బధిరులు అందరూ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని తెలిపారు. వైకల్యం ఉన్నంత మాత్రాన తాము అనుకున్న లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహించరాదని, తమలాంటి వారికి గ్రాహ్య శక్తి
ఎక్కువగా ఉంటుందని అన్నారు. తాము పట్టుదలతో ఉన్నత చదువులు అభ్యసిస్తే తప్పక లక్ష్యం సాధించగలుగుతారని అన్నారు. ఆటల్లో, చదువులో తమకు ఎటువంటి సమస్య ఎదురైన ప్రభుత్వ యంత్రాంగం తమకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఐదుగురు బధిరులకు స్మార్ట్ ఫోన్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి వారికి ఆప్యాయతగా తినిపించారు. బధిరులు వారి సంకేతాలను జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తూ ఆనందోత్సాహం తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి ఆదివారం నాడు "ప్రపంచ బధిరుల దినోత్సవం" నిర్వహించుకోవటం జరుగుతున్నదనీ, దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో సెప్టెంబర్ 27, ఆదివారం నాడు నిర్వహించడమైనదన్నారు.
సెప్టెంబర్ 21 నుండి 27 వరకు అంతర్జాతీయ బధిరుల వారంగా పాటిస్తారన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23ను "అంతర్జాతీయ సాంకేతిక భాషా దినోత్సవంగా" జరుపుకుంటారన్నారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ సంస్థ ఈ దినోత్సవాన్ని ప్రారంభించిందన్నారు.
బధిరుల హక్కులు, సమాజంలో వారి భాగస్వామ్యం, సమాన అవకాశాల గురించి ప్రపంచానికి తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. సైన్ లాంగ్వేజ్ (సాంకేతిక భాష) ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. విద్య, ఉద్యోగం లో సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బధిరులకు సాంకేతిక భాష ప్రసార సాధనంగా, సంభాషణ మాధ్యమంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న 'సదరం' సర్టిఫికేట్ ద్వారా వైద్య ధృవీకరణ,
ఉచిత కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు,
ఉచిత వినికిడి పరికరాల పంపిణీ వంటివి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
వీరికి ప్రత్యేక పాఠశాలలు, స్కాలర్‌షిప్‌ల సౌకర్యం అందిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు పశ్చిమ గోదావరి జిల్లా డెఫ్ అసోసియేషన్, డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం కలిసి మెమోంటో, దృశ్యాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా డెఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. ఉమామహేశ్వరరావు, జనరల్ సెక్రటరీ తోట రాము, ప్రముఖ సాంఘిక సంఘసంస్కర్త చెరుకూరి రంగస్వామి, డిఫ్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ సిహెచ్ తాతారావు, టిటిడి బధిరుల పాఠశాల విద్యార్థులు, డి ఎన్ ఆర్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ పాండురంగారావు, డిఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.
చేకూరి సూరిబాబుకి వైసీపీ నేత మేకా శేషుబాబు పరామర్శ
పోడూరు:
ఆచంట మాజీ ఏఎంసి చైర్మన్, వైసీపీ నేత చేకూరి సూర్యనారాయణ రాజు (సూరిబాబు) తండ్రి రామకృష్ణంరాజు ఇటీవల స్వర్గస్తులయ్యారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వైసీపీ సీఈసీ మెంబర్ మేకా శేషుబాబు ఆదివారం పోడూరు గ్రామానికి వెళ్లి సూరిబాబును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామకృష్ణంరాజు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. శేషుబాబు తో పాటు మండల వైసీపీ నాయకులు రుద్రరాజు శివాజీ రాజు , రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న ,పెచ్చేటి కోటేశ్వరరావు , శీలం సూరిబాబు , నున్నబోయిన వెంకటేశ్వరరావు , బందెల నరేష్ తదితరులు సూరిబాబుని పరామర్శించారు.
కవిటం ఉత్తర పేటలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి
పోడూరు:
పోడూరు మండలం కవిటం గ్రామం ఉత్తరపేటలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లు నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ డిమాండ్ చేసారు. పోడూరు మండలం కవిటం ఉత్తరపేటలో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో కాలనివాసులు ధర్నా చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. వర్షం నీరు, బురదతో ఉన్న రోడ్లపై స్కూలుకి ఎలా వెళ్లాలని చిన్నపిల్లలు రోడ్డు పై బయటాయించి నిరసన్ల తెలిపారు. ఈ సందర్బంగా గోపాలన్ మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు ఉత్తర పేట కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజి లు ఏర్పాటు చేయలేదన్నారు. స్కూల్ పిల్లలు స్కూలుకి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. త్రాగు నీరు గాని, రోడ్లు, డ్రైనేజి లు ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. వర్షం వస్తే మోకాలు లోతు నీరు ఉండడంతో కాలనివాసులు ఇబ్బందులకు గురవు తున్నారన్నారు. ఎస్సీ కాలనీలో సబ్ ప్లాన్ నిధులు విడుదలచేసి వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ పోడూరు మండల కన్వీనర్ కె వెంకటేశ్వర్లు, ఠాగూర్, బోష్, కోట చిట్టిబాబు, ఇంజెటీ వెంకటేష్, కిషోర్,చింతాడ దొరబాబు, దిండే రామకృష్ణ, నక్కా కొండలరావు, మట్టా రాజు, నర్సయ్య, అనంత, సిర్రా నరసింహామూర్తి, సనమండ అనంత, సిర్రా సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
జీవో నెంబర్:102 రద్దు చేయాలి.. జీవో నెంబర్: 151 అమలు చేయాలి.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. వంగవీటి మోహన్ రంగా కుటుంబానికి మాల మహానాడు అండగా ఉంటుంది.. మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్
పాలకొల్లు:
పాలకొల్లు మండలం లంకలకోడేరు రాజీవ్ కాలనీ , పాత కమ్యూనిటీ హాలు వద్ద ఆదివారం మాలమహానాడు సమావేశం జరిగింది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన రంగాకు కులం ఆపాదించడం సరికాదని, రంగా అందరివాడని నల్లి రాజేష్ అన్నారు. దళితుల పక్షాన రంగా నిలబడి అండగా నిలబడి పోరాడిన విషయాన్ని దళితులు ఎప్పటికి మర్చిపోరన్నారు. దళితుల పక్షాన నిలబడి రంగా ఎంతో సేవ చేశారని కొనియాడారు. రంగా కుటుంబానికి మాలమహానాడు అన్నివేళలా అండగా ఉంటుందని నల్లి రాజేష్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా నల్లి రాజేష్ మాలమహానాడు లంకలకోడేరు నూతన గ్రామ కమిటీని, మండల కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు,
నూతన కమిటీ
1 ఏలూరి రాజ్ కమల్ గ్రామ అధ్యక్షులు
2 బందెల పృధ్వీరాజ్ గ్రామ కార్యదర్శి
3 చొప్పుల వెంకట్రావు మండల కార్యదర్శి
4 బద్దా సంపద రావు గ్రామ ఉపాధ్యాక్షులు
5 అడిదెల తేజ సంయుక్త కార్యదర్శి
6 కర్ని సురేంద్ర. గ్రామ కోశాధికారి
7 పీతల పవన్ మండల యువజన కార్యదర్శి
8 విప్పత్తి రవి వర్మ కమిటీ మెంబర్
9 ఏలూరి ఆనంద కమల్ కమిటీ మెంబర్
10 కత్తిమండ సచిన్ కమిటీ మెంబర్
11 ఏనుగుపల్లి రాజేంద్రప్రసాద్ మండల యువజన కార్యదర్శి
12 చొప్పల రాజేష్
మండల ఉపాధ్యక్షులు
13 ఏనుగుపల్లి రమేష్ గ్రామ యువజన అధ్యక్షులు
14 కత్తిమండ అశోక్ కమిటీ మెంబర్
15 ఉన్నమట్ల గణేష్ కమిటీ మెంబర్
16 చొప్పల జాన్ బాబు మండల కార్యదర్శి
17 తేలి ప్రదీప్ గ్రామ యువజన కార్యదర్శి
18 పల్లి ప్రశాంత్ గ్రామ సహాయ కార్యదర్శి
ఈ కార్యక్రమలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిలు కర్ని జోగయ్య, మర్రె సామ్యూల్, జిల్లా అధ్యక్షులు గుండె నగేష్ బాబు, జిల్లా కోశాధికారి ఏనుగుపల్లి చంద్రశేఖర్,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పాలపర్తి కృపానాథ్, జిల్లా సంయుక్త కార్యద్ఫర్సి తోకల జనార్ధన్, జిల్లా కార్యదర్శి విప్పర్తి నవీన్, పాలకొల్లు మండల అధ్యక్షులు గుమ్మాపు రవి, పా లకొల్లు మండల మహిళ అధ్యక్షురాలు చిలకపాటి మేరిరత్నం, పాలకొల్లు నియోజకవర్గ కార్యదర్శి కొయ్యే లక్ష్మణరావు, పాలకొల్లు మండల యూత్ ప్రెసిడెంట్ మందపాటి జోసెఫ్ రాజు, పోడూరు మండల యూత్ ప్రెసిడెంట్ సరెళ్ళ రఘు, జిల్లా కార్యదర్శి పోనుకుమట్ల వీరస్వామి , పాలకొల్లు నియోజక వర్గ సంయుక్త కార్యదర్శిలు కప్పల కోటేశ్వరరావు, సరెళ్ళ రామారావు తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...
-
టిడ్కో గృహాల ఆవరణలో దేవినవరాత్రుల వేడుకకు ఏర్పాట్లు పాలకొల్లు: పాలకొల్లు టిడ్కో నివాస సముదాయాల్లో 98, 93, 94 బ్లాక్ ల ఆవరణలో శ్రీ శ్రీ శ్రీ ...
-
గంజాయి నిర్మూలించండి.. యువతను కాపాడండి .. నినాదంతో మార్టేరు నుండి ఆచంట వరకు బుధవారం మార్టేరు బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 8...
-
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...


















































