జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో  బుధవారం ఆయన పార్టీ కండువా కప్పుకొని జనసేన పార్టీలో చేరారు. ఆచంట నియోజకవర్గంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు, నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ గుర్తింపు పొందిన తుంగా నాగేశ్వరరావు జనసేన పార్టీలో చేరడం ఆచంట నియోజకవర్గంలో ప్రాధాన్యత సంతరించుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో జనసేన పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా తుంగా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జనసేన పార్టీ ని ఆచంట నియోజకవర్గం లో మరింత బలోపేతం చేయటంతో పాటు ప్రజా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తుంగా నాగేశ్వరరావు తెలిపారు.

మార్టేరులో ఖండవల్లి కుటుంబీకులచే ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు, ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ

మార్టేరులో ఖండవల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ఉచిత ఉచితంగా కళ్ళజోళ్ళు అందిస్తున్న దృశ్యం

మార్టేరు శివరావుపేటలో ఖండవల్లి రాజ్యలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థ ఖండవల్లి వెంకట సత్యనారాయణ ఇంటి వద్ద అమృత లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ,  శంకర నేత్రాలయం పాలకొల్లు వారి పర్యవేక్షణ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. క్యాంప్ లో మొత్తం 360 మంది కి ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. వారిలో అవసరమైన 295మంది కి ఈనెల 13వ తేదీన మంగళవారం ఖండవల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ఉచితంగా కళ్ళజోళ్ళు  అందజేశారు. అలాగే  34 మందికి  ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ లో ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. వారికి కూడా  ఖండవల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ క్యాంప్ నిర్వహించిన ఖండవల్లి వెంకట సత్యనారాయణ  కుమారులైన ఖండవల్లి శ్రీనివాస్, శ్రీధర్, కిషోర్ ,రమేష్ సోదరులు నలుగురూ తమ స్వగ్రామమైన మార్టేరులో ఊరి కోసం, ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల మన్ననలు  పొందుతున్నారు. తాజాగా గ్రామంలో పేద వృద్ధులకు, పేద ప్రజలకు ఉపయోగపరంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి, ఉచితంగా కంటి శాస్త్ర చికిత్సలు చేయించడం, ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేయడం ఎంతో అభినందనీయమని గ్రామ పెద్దలు, గ్రామస్తులు వారిని కొనియాడుతున్నారు. క్యాంపు నిర్వహణ లో కొనాల సతీష్ రెడ్డి, నందివాడ నాగరాజు, సత్తి సుబ్బన్న రెడ్డి, సత్తి అచ్చిరెడ్డి, వాసు, జగదీష్ సేవలందించారు.

పాలకొల్లులో విగ్రహ దాత సూర్యనారాయణకు సత్కారం

 


పాలకొల్లు:అభయాంజనేయ స్వామి కమిటీ ఆధ్వర్యంలో పాలకొల్లు టిడ్కో నివాస సముదాయాల మధ్యలో  అభయాంజనేయ స్వామి విగ్రహదాత కొండా సూర్యనారాయణను సోమవారం స్థానిక ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో  అభయాంజనేయ స్వామి కమిటీ గౌరవ అధ్యక్షులు వీరవల్లి దుర్గారావు, పెమ్మిరెడ్డి అచ్యుతరామయ్య, కమిటీ అధ్యక్షులు పోతుల రాధాకృష్ణ, కార్యదర్శి యాదాల రామకృష్ణ, కోశాధికారి పెచ్చెట్టి సుబ్రహ్మణ్యం, ఆర్. కృష్ణయ్య జాతీయ బీసీ సంఘం కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు శిడగం రవి శేఖర్, పెందుర్తి రమేష్, తోట మణి, పులగం శ్యామల గౌరీ, శిరిగినీడి వెంకటలక్ష్మి, సబ్బు అంజలి, దొంగ విజయలక్ష్మి, జయశ్రీ రాజు  కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చించినాడ బ్రిడ్జిపై అక్టోబర్ 15, 16 తేదీల్లో రాకపోకలు నిలిపివేత ..--24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు


పాలకొల్లు: చించినాడ బ్రిడ్జిపై రోడ్డు బేరింగ్ మరమ్మతు పనుల నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6.00 గంటల నుంచి అక్టోబర్ 16వ తేదీ ఉదయం 6.00గంటల వరకు 24 గంటల పాటు అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చించినాడ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు సురక్షితంగా కొనసాగేందుకు అవసరమైన రోడ్డు బేరింగ్ మరమ్మతు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులను సజావుగా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఒకరోజు పాటు వంతెనపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తోందని వివరించారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా ఎలాంటి వాహనాలను వంతెనపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో చించినాడ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే ప్రజలు, వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలనీ, ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని సూచించారు.
ప్రజల భద్రత, వంతెనపై సురక్షిత రవాణా సౌకర్యాల మెరుగుదల కోసమే ఈ మరమ్మతు పనులు చేపడుతున్నామనీ, ప్రజలు అసౌకర్యాన్ని అర్థం చేసుకుని జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

పెనుమదంలో అమ్మవారిని దర్శించుకున్న దేవరపు దొరబాబు దంపతులు

పెనుమదంలో అమ్మవారిని దర్శించుకుంటున్న దేవరపు దొరబాబు, పద్మనాగలక్ష్మి దంపతులు

పెనుమదం: పెనుమదం గ్రామంలో ఉయ్యాల స్తంభాల సెంటర్లో దేవి నవరాత్రుల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెనుమాదం నీటి సంఘం అధ్యక్షులు, టిడిపి నాయకులు దేవరపు దొరబాబు, మాజీ ఎంపీటీసీ దేవరపు పద్మ నాగలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వైభవంగా బతుకమ్మ పండుగ

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కేటీ, ఫుల్షియర్‌లో బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్న మహిళలు
Bathukamma festival celebrated grandly in Texas USA, Telugu women celebrate Bathukamma in Katy Texas Houston, NRI Telangana culture news, Bathukamma Festival America 2026

 అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగర సమీపంలోని కేటీ, ఫుల్షియర్‌లో మహిళలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మను భక్తిశ్రద్ధలతో ఆడుతూ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. గౌరమ్మను పూజిస్తూ, బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లతో లయబద్ధంగా బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. బతుకమ్మలో తొలి రోజుగా జరుపుకునే ఎంగిలిపూల బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. మాతృభూమి సంస్కృతిని మరువకుండా, బతుకమ్మ వంటి పండుగలను ఘనంగా జరుపుకోవడం ద్వారా భారతీయ మహిళలు తమ సంప్రదాయాల పట్ల ఉన్న మమకారాన్ని చాటుకోవడం కేటీ, ఫుల్షియర్‌ ప్రాంతాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

పాలకొల్లులో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషితో 365 మంది దివ్యాంగులకు రూ.1.10 కోట్ల విలువైన సహాయక ఉపకరణాల పంపిణీ

--SAIL సీఎస్‌ఆర్ నిధులతో 530 ఉపకరణాల ఉచిత పంపిణీ


-- పాలకొల్లు మార్కెట్ యార్డులో 12-10-2026 తేదీన  మంగళవారం  కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా పంపిణీ



పాలకొల్లు: దివ్యాంగులకు అండగా నిలిచి, వారు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన సహాయక ఉపకరణాలను అందించాలనే లక్ష్యంతో పాలకొల్లులో భారీ స్థాయిలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.1.10 కోట్లను మంజూరు చేయించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం పాలకొల్లు మార్కెట్ యార్డులో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేయనున్నారు.

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...