పోడూరు గ్రామ ప్రముఖులు చేకూరి సూరిబాబుకి పితృవియోగం


పోడూరు: పోడూరు గ్రామ ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చేకూరి సూర్యనారాయణరాజు (సూరిబాబు) తండ్రి, ఆచంట ఏఎంసీ మాజీ చైర్మన్  చేకూరి రామకృష్ణంరాజు (87) శనివారం స్వర్గస్తులయ్యారు. రామకృష్ణంరాజు ఇక లేరన్న విషాదవార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పోడూరు గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. రామకృష్ణంరాజుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె  ఉన్నారు. పెద్ద కుమారుడు చేకూరి నరసింహరాజు (చిట్టిబాబు), రెండో కుమారుడు చేకూరి సూర్యనారాయణరాజు (సూరిబాబు), మూడో కుమారుడు చేకూరి సాయిబాబా శ్రీనివాసరాజు (సాయి), కుమార్తె  అన్నపూర్ణ . పితృవియోగంతో తీవ్ర విషాదంలో ఉన్న సూరిబాబును , కుటుంబ సభ్యులను   మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి చెరకువాడ శ్రీరంగనాథరాజు, కవురు శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యుడు, ఫ్లోర్ లీడర్ గుంటూరి పెద్దిరాజు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డీటీడీసీ బాబు, పాలకొల్లు న్యూ లైఫ్ వైద్యుడు వర్మ,  , ఎంపీపీ సబ్బితి సుమంగళి సాగర్, పోడూరు మాజీ సర్పంచ్ శెట్టిబత్తుల సువర్ణరాజు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పిల్లి నాగన్న, పోతుమూడి రామచంద్రరావు తో పోడూరు, ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ మండలాలకు చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పరామర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...