అమరావతి: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 18 వరకు పొడిగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే మరో 2 రోజులు గడువు పెంచినట్లు తెలిపారు. గతంలో సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ఉన్న గడువును 18వ తేదీ వరకు పొడిగించామన్నారు. గడువు పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీకి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి