వైసీపీ నేత గుంటూరి పెద్దిరాజుకు అభినందనలు వెల్లువ

పోడూరు:


వైసీపీ పార్లమెంటరీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైన సందర్భంగా పోడూరు మండల తాజా జడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజును శనివారం  కొమ్ముచిక్కాల గ్రామంలోని ఆయన నివాసంలో మండలానికి చెందిన వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. వైసీపీ ఆవిర్భావం నుంచి  పార్టీకి మండలంలో నాయకత్వం వహించి స్థానిక ఎన్నికల్లోను, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోను పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్న గుంటూరి పెద్దిరాజుకు పార్లమెంటరీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం ఎంతో శుభ పరిణామమని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తాజా మాజీ ఎంపీపీ సబ్బితి సుమంగళి సాగర్, పార్టీ నాయకులు గుంటూరి చంటిరాజు, కొర్రపాటి వీరాస్వామి, యారకరాజు పెద్దిరాజు, నాగరాజు బాలాజీ వర్మ, గుబ్బల సత్యనారాయణ, పెచ్చెట్టి త్రిమూర్తులు, దొమ్మేటి ఏడుకొండలు, జక్కం శెట్టి అప్పాజీ, తానేటి సురేష్, కుసుమే సుభాకర్ తదితరులు పెద్దిరాజుకు అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...