ఈ చలాన్లు కట్టకపోతే ఆ సొమ్ము విద్యుత్ బిల్లులకు జోడించండి.. --సుప్రీంకోర్టు

 న్యూఢిల్లీ:


నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు ఈ చలాన్లు చెల్లించకపోతే ఆ సొమ్మును విద్యుత్ బిల్లులో చేర్చాలని సుప్రీంకోర్టు కొరడా ఝళి పించింది. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతకు గాను వాహనదారులు, చోదకులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇప్పటివరకూ ఈ-చలాన్ల రూపంలో విధించిన జరిమానాల్లో ఇంకా రూ.20వేల కోట్ల వసూలు కాని విషయాన్ని గుర్తు చేస్తూ కఠిన చర్యలకు ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై 2012లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రూ.45వేల కోట్ల విలువైన చలానాలు జారీచేయగా ఇప్పటివరకు రూ.25వేల కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు కోర్టు సహాయకుడు(అమికస్ క్యూరీ) తెలిపిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. • ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలకు జారీ అయిన చలాన్లను నెలవారీ విద్యుత్తు బిల్లులో చేర్చి వసూలుచేయాలని ఆదేశించింది. విద్యుత్తు బిల్లు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరా కట్ చేస్తారు కాబట్టి జరిమానా కచ్చితంగా చెల్లిస్తారని అభిప్రాయపడింది. • ఈ-చలానా బకాయిలు చెల్లించని వాహనాలకు ఆన్లైన్ సేవలైన ఆర్సీల పునరుద్ధరణ, డూప్లికేట్ ఆర్సీల జారీ, యజమాని చిరునామా అప్డేషన్ లాంటి సేవలు నిషేధించాలనీ,  ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా వాహన స్వాధీనానికి చర్యలు తీసుకోవాలనీ, ఎక్కువసార్లు ఉల్లంఘనలకు పాల్పడిన వారి డ్రైవింగ్ లైసెన్స్/రెన్యూవల్ను రద్దు చేయాలనీ ధర్మాసనం సూచించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...