పాలకొల్లు:
ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు బొప్పన వీర రాఘవయ్య(82) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత డాక్టర్ రాఘవయ్య 2 రూపాయలకే చిన్నపిల్లలకు వైద్య సేవలందిస్తూ పేద, సామాన్య ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన పట్టుకుంటేనే చిన్న పిల్లలకు ఎటువంటి వ్యాధి అయినా నయమవుతుందనే నమ్మకంతో డాక్టర్ రాఘవయ్య మంచి హస్తవాసి గల వైద్యుడిగా పేరు గడించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డాక్టర్ రాఘవయ్య ఇక లేదన్న వార్త తెలిసి ఆయన వద్ద వైద్య సేవలు పొందిన ప్రజలు, ఆయన గురించి తెలిసిన ప్రజలు పాలకొల్లు పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు ఆయన అందించిన వైద్య సేవలను గుర్తు చేసుకున్నారు. డాక్టర్ రాఘవయ్య మృతి పట్ల పాలకొల్లు పట్టణంలోని ప్రముఖ వైద్యులు, ప్రముఖ నాయకులు సంతాపం తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి