వైసీపీ పార్టీ పదవులున్నవారికి ఐడీ కార్డులు అందజేత


పోడూరు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మాజీ మంత్రి, పి.ఏ.సి సభ్యులు  చెరుకువాడ శ్రీ రంగనాథరాజు  ఆధ్వర్యంలో పోడూరు మండలం తూర్పు పాలెం పార్టీ కార్యాలయంలో  బుధవారం పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేశారు.ఆచంట నియోజకవర్గం లోని పోడూరు , ఆచంట మండలాల  కు చెందిన పార్టీ పదవులు , వివిధ హోదా కలిగిన , అనుబంధ సంఘాల నాయకులకు ఐడెంటి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్,గూడూరు ఉమా బాల ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి మేడపాటి షర్మిలా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి ఉమాబాల, ఆచంట నియోజకవర్గ ఇంచార్జి షర్మిలారెడ్డి  మాట్లాడారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ   సుమంగళి సాగర్,మండల పార్టీ కన్వీనర్ పిల్లి నాగన్న , ఆచంట మండల పార్టీ కన్వీనర్ జక్కంశెట్టి శ్రీరాములు,  గుబ్బల వీర బ్రహ్మం, పోతుమూ డి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...