రాజమండ్రి:
బీసీల హక్కుల కోసం గర్జించిన లక్షలాది గొంతుకలే బీసీ గర్జన సభ అని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి వెంకటాద్రి గార్డెన్స్ లో నిర్వహించిన వెన్నుపోటు పార్టీ వంచన పై బీసీ గర్జన సభలో ఎమ్మెల్సీ కవురు ఉద్వేగ భరితంగా ప్రసంగించి బీసీల గొంతుక వినిపించారు. వెన్నుపోటు పార్టీలు ఎన్ని వచ్చినా బీసీల గొంతును అణచలేరనీ, బీసీల ఐక్యతను ఆపలేరని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ నొక్కి చెప్పారు. బీసీల గర్జనతో
రాజమండ్రి మార్మోగిందనీ, ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి బీసీల ఐక్యతను చాటిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీసీల సమస్యలు, హక్కులు, ప్రాతినిధ్యంపై భవిష్యత్తులో మరింత బలంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం, సముచిత ప్రాతినిధ్యం, హక్కుల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని కవురు శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీసీ గర్జనను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, బీసీ సోదరులు, అభిమానులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి