జిన్నూరు సూర్యానగర్ కాలనీలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు

 జిన్నూరు:


జిన్నూరు గ్రామంలోని సూర్యా నగర్ కాలనీలో  వినాయక యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 12 ఏళ్లుగా సూర్యా నగర్ కాలనీలో వినాయక యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు.  కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి స్థానిక మహిళలు, చిన్నారులు,  భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా సూర్యా కాలనీలో 20వ తేదీన ఆదివారం ఘనంగా అన్న సంతర్పణ జరిపారు. ఈ నెల 26వ తేదీ శనివారం నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...