మెనూ ప్రకారమే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టాలి ...గుమ్మలూరు జడ్పీ హైస్కూల్లో భోజనం పథకం అమలు తీరును పరిశీలించిన తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్

పోడూరు(గుమ్మలూరు):


ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారమే భోజనాలు పెట్టాలని స్థానిక తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫజిల్ మధ్యాహ్న భోజనం పథకం సిబ్బందికి, ఉపాధ్యాయులకు సూచించారు. పోడూరు మండలంలోని గుమ్మలూరు జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్నం భోజన పథకం అమలుతీరును బుధవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు పెట్టిన భోజనాలను ఆయన స్వయంగా తిని పరిశీలించారు. అయితే మెనూ ప్రకారం  మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ,  ఉడకబెట్టిన కోడిగుడ్డు విద్యార్థులకు పెట్టాల్సిఉండగా.. ఎగ్ ఫ్రైడ్ రైస్ వడ్డించారు. అది కూడా రుచికరంగా లేదని తాసిల్దార్ మధ్యాహ్నభోజన పథకం సిబ్బంది , ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మెనూ ప్రకారమే హై స్కూల్లో విద్యార్థులకు భోజనాలు వండి పెట్టాలనీ, భోజన పదార్థాలు నాసిరకంగా కాకుండా నాణ్యతతోను, రుచికరంగా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ,  లేకుంటే భోజన పథకం నిర్వాహకులపై నిబంధనల మేరకు తగుచర్యలు తీసుకుంటామని తాసిల్దార్ మౌలానా ఫాజిల్ హెచ్చరించారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...