--అధికారులపై మాల మహానాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ధ్వజం
ఆచంట: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు బిల్లులు, జీతాలు చెల్లించకపోవడం చాలా దారుణమని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంట వేమవరం జిల్లా పరిషత్ హై స్కూలులో మంగళవారం భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరు తో ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం పథకం అమలుచేయడం మంచి నిర్ణయమన్నారు. అయితే ప్రభుత్వం బియ్యం, గుడ్లు సరఫరా చేసి మిగతా సరుకులకు నెలవారీగా బిల్లులు చెల్లించాల్సి ఉందనీ, గత ఏప్రిల్ నుండి భోజన పథకం నిర్వాహకులకు బిల్లులు, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని పుష్పరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు, జీతాలు చెల్లింపులో తీవ్ర జాప్యం వల్ల భోజనం పథకం నిర్వాహకులు తమ బంగారం తాకట్టు పెట్టో, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చో భోజన పథకం ను ఆగకుండా కొనసాగించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఏ రోజు ఆపకుండా చాలా అంకితభావంతో ప్రభుత్వ ఆశయాన్ని ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ఇదే విషయాన్ని భోజన పథకం నిర్వాహకులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు అనేకసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఒకపక్క భోజనం పథకం నిర్వాహకులు ఎన్నో వ్యయ ప్రయాసలు పడి భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేస్తూ, ప్రభుత్వ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ప్రభుత్వాధికారులు మాత్రం జీతాలు, బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం వహిస్తున్నారనీ, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి భోజన పథకం నిర్వాహకులకు జీతాలు, బిల్లులు చెల్లించాలని పుష్పరాజ్ డిమాండ్ చేశారు. లేకుంటే భోజనం పథకం నిర్వాహకులకు జీతాలు, బిల్లులు చెల్లించే వరకు మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కోలాటి ప్రసాదరావు, పలువురు కమిటీ సభ్యులు పుష్పరాజ్ వెంట ఉన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి