యువత చదువుతో పాటు సంస్కృతి, విభిన్న కళల పై ఆసక్తి చూపాలి ... జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి

 జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీలు 2026 

భీమవరం:


నేటి యువత చదువుతోపాటు  విభిన్న కళలు, సంస్కృతి, లలిత కళలు పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరి యంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ,  సెట్‌వెల్ - పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యువ జన సాంస్కృతిక పోటీలు - 2026 కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ​యువత చదువుతో పాటు కళల్లో నైపుణ్యం సాధించి క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల విద్యార్థుల్లో  క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.   స్వామి వివేకానంద స్ఫూర్తి తో యువత ముందుకు సాగాలని అన్నారు.

లలిత కళలు, సాంస్కృతిక అంశాల్లో ప్రావీణ్యం ఉన్నవారు భవిష్యత్తులో ఉద్యోగాల్లో చేరినప్పుడు మంచి టీమ్ స్పిరిట్‌తో పనిచేసి, ఇతరుల ను సైతం మెరుగ్గా సమన్వయంతో పని చేయగలరని తెలిపారు. జిల్లా స్థాయి పోటీలలో యువత తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటు కళలు, సంస్కృతి, సంప్రదా యాలపై ఆసక్తిని పెంపొందించుకునే మంచి అవకాశమని అన్నారు.  వివిధ సాంస్కృతిక విభాగాల్లో ప్రతిభ కనబరిచిన యువత కు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించ డంతో పాటు ప్రోత్సాహం అందించటం జరుగు తుందన్నారు.ఈ వేదికపై నిర్వహిస్తున్న ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్, వీధి నాటికలు, పెయింటింగ్, వ్యాస రచన వంటి 5 రకాల అంశాల పోటీల్లో యువతీ యువకులు, విద్యార్థులందరూ క్రియాశీలకంగా, ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటు కోవాలని తెలిపారు.

జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను కనబరచాలని తెలిపారు.  జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచే యువత కు రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందని అన్నారు.

​కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, విజేతలకు, నిర్వాహకులకు జిల్లా కలెక్టర్  శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజ నేయులు మాట్లాడు తూ దేశ గొప్పత నాన్ని ప్రపంచ స్థాయిలో తెలిపిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు.  యువతతోనే దేశాభివృద్ధి సాధ్య మని తెలిపారు.  యువత దీక్ష పట్టుద లతో చేపట్టిన ఏ కార్యక్రమంలో అయినా విజయం సాధించగలుగుతారని అన్నారు.  విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాలలో తమకు ఆసక్తికర మైన రంగాలలో సాధన చేస్తే నిష్ణాతు లు అవుతారని అన్నారు.  దీనివలన దేశ ప్రగతికి ఎంతో మేలు కలుగు తుందని తెలిపారు.  శిక్షణ పొందిన యువత దేశ సేవకు ఎంతో అవసరమని అన్నారు.  యువత మంచి ఆలోచన, నడవడితో ముందు కు సాగితే రాష్ట్రాని కి,  దేశానికి మంచి పేరు తీసుకు రావచ్చుఅని అన్నారు. సెట్వెల్ సి.ఈ.ఓ, జిల్లా యువజన సంక్షేమాధికారి శ్రీ కె. ఎస్.ప్రభాకరరావు మాట్లాడుతూ  యువతలోని కళా ప్రతిభను వెలికితీ యడం, సంప్రదాయ కళలను ప్రోత్స హించడం, ఆరోగ్య కరమైన సృజనాత్మక వాతావరణాన్ని కల్పించడం ద్వారా యువజన శక్తిని సమాజ అభివృద్ధికి వినియోగించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.  ప్రభుత్వం యువజనోత్సవాల ద్వారా యువతలో ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయిలో అవకాశాలు కల్పించే విధానాన్ని ప్రోత్స హిస్తుందని అన్నారు.

తోలుత జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు శ్రీ వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో  కళాశాల డైరెక్టర్ డా. యం. జగపతిరాజ,  ప్రిన్సిపాల్ డా. బి.ఆర్.కె.వర్మ , యూత్ కోఆర్డినేటర్ శ్రీ గాదిరాజు హరీష్ వర్మ, అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...