--SAIL సీఎస్‌ఆర్ నిధులతో 530 ఉపకరణాల ఉచిత పంపిణీ
-- పాలకొల్లు మార్కెట్ యార్డులో 12-10-2026 తేదీన మంగళవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా పంపిణీ
పాలకొల్లు: దివ్యాంగులకు అండగా నిలిచి, వారు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన సహాయక ఉపకరణాలను అందించాలనే లక్ష్యంతో పాలకొల్లులో భారీ స్థాయిలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.1.10 కోట్లను మంజూరు చేయించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం పాలకొల్లు మార్కెట్ యార్డులో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేయనున్నారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి