పెనుగొండ భాష్యం స్కూలులో ముందస్తు విజయదశమి వేడుకల్లో నవదుర్గల వేషధారణతో అలరించిన చిన్నారులు
పెనుగొండ: పెనుగొండ భాష్యం పాఠశాలలో ఘనంగా జరిగిన దేవీ నవరాత్రుల పండుగ వేడుకలు* పెనుగొండ భాష్యం పాఠశాలలో శనివారం విద్యార్థులు , ఉపాధ్యాయులతో కలిసి ముందస్తుగా విజయదశమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భాష్యం పాఠశాల చిన్నారులంతా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు ప్రదర్శించిన నవదుర్గల వేషధారణ ఎంతో అలరించింది. వేడుకల్లో ప్రిన్సిపల్ ఎన్. వి అప్పారావు మాట్లాడుతూ చెడు మీద మంచి సాధించిన విజయానికి విజయదశమి పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ పండుగను ప్రాంతాల వారీగా విజయదశమి (దసరా), బతుకమ్మ వంటి వివిధ పేర్లతో పిలుస్తారన్నారు. ఆ చల్లని తల్లి లాలనతో, ప్రేమతో, కరుణ చూపుతోందనీ, తప్పు చేస్తే కాళికా అవతారంతో దండిస్తుందనీ, ఆ చల్లని తల్లి అందరి నీ కరుణతో చూడాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం జోనల్ ఇన్చార్జ్ ఎ శ్రీమన్నారాయణ రెడ్డి , చాంప్స్ ఇంచార్జ్ శ రాణి రోజాజీ , ఉపాధ్యాయ- ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి