పాలకొల్లు:మహాత్మాగాంధీ ఆచరించిన అహింసా మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలని
మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జనసేన జిల్లా కార్యదర్శి బోణం వెంకట నరసయ్య (చినబాబు), బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది తదితరులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ యుసిసి సభ్యులు జక్కంపూడి కుమార్, తులా రామలింగేశ్వరరావు, గండేటి వెంకటేశ్వరరావు, కర్నేన గౌరు నాయుడు, పెచ్చెట్టి బాబు, మజ్జి సన్యాసినాయుడు, ధనాని ప్రకాష్, మీసాల రాము, కొల్లి కొండా ప్రసాద్, మహమ్మద్ జానీ, పెండ్యాల భవాని, ఎస్తేరు రాణి, ఫకీర్ బాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి