కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావును సత్కరిస్తున్న శెట్టిబలిజ సంఘాల పెద్దలు
ఆచంట: యలమంచిలి మండలం గుంపర్రు గ్రామంలో కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు నివాసం వద్ద శుక్రవారం రాత్రి ఆచంట నియోజకవర్గం లోని శెట్టిబలిజ సంఘాల గ్రామ పెద్దల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఆచంట నియోజకవర్గంలోని ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు మండలాలకు చెందిన వివిధ గ్రామాల శెట్టిబలిజ సంఘాల గ్రామ పెద్దలు, నాయకులు 800 మంది గ్రామ పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుంగా నాగేశ్వరరావు సమావేశానికి హాజరైన గ్రామ పెద్దలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలతో పలు అంశాలపై చర్చించారు.
రానున్న కార్తీక మాసంలో శెట్టిబలిజ వన సమారాధన నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామ పెద్దల సూచన మేరకు ఆచంట మార్కెట్ యార్డులో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఆచంట నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శెట్టిబలిజ కుటుంబాల వివరాలను తన దృష్టికి తీసుకురావాలని తుంగా నాగేశ్వరరావు కోరారు. ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచేలా కారుణ్య ట్రస్ట్ సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు. తనకు వచ్చే ఆదాయంలో 70 శాతం ప్రజాసేవకే కేటాయిస్తానని తెలిపారు.
అలాగే శెట్టిబలిజ నాయకుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాలను ఆచంట నియోజకవర్గంలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయిస్తే, విగ్రహాలను తయారు చేయించి అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నియోజకవర్గ స్థాయి గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. శెట్టిబలిజ వర్గంలో పుట్టి ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న తుంగా నాగేశ్వరరావు సేవలు అభినందనీయమన్నారు. ప్రజలకు సేవ చేసే వ్యక్తి తమ వర్గంలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.
సమావేశం అనంతరం హాజరైన గ్రామ పెద్దలు, నాయకులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. సమావేశానికి సుమారు 800 మంది గ్రామ పెద్దలు, శెట్టిబలిజ నాయకులు హాజరయ్యారు. ఆత్మీయ సమావేశానికి భారీ సంఖ్యలో విచ్చేసిన శెట్టిబలిజ సంఘాల పెద్దలందరికీ నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి