గురుకుల పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి.. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు జోగాడ

   వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు  జోగాడ ఉమామహేశ్వరరావు


గురుకుల పాఠశాలల పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని    వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు జోగాడ ఉమామహేశ్వరరావు పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో విధి నిర్వహణలో ఉన్న సుమారు 1680 మంది పార్ట్ టైమ్ ఉపాద్యాయులు వారం రోజులుగా  తమ న్యాయమైన సమస్యలను   పరిష్కరించాలంటూ విజయవాడ లో శాంతియుతంగా  నిరసన తెలియజేస్తున్నా   కూటమి ప్రభుత్వం  చలనం లేకుండా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని నడిపించే ఉపాద్యాయులు తమ హక్కులు కోసం, పెండింగ్ సమస్యలు కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాల్సి రావడం ఎంతో విచారకరమన్నారు. దీనివల్ల  గురుకుల పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడుతుందనీ, విద్యార్థులు ఎంతో నష్టపోతారనీ జోగాడ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి  గురుకుల పాఠశాలల్లో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జోగాడ డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...