పాలకొల్లు న్యూస్ - పాలకొల్లు తాజా వార్తలు, పశ్చిమగోదావరి జిల్లా వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు తెలుగులో.. 7330935849
చించినాడ బ్రిడ్జిపై అక్టోబర్ 15, 16 తేదీల్లో రాకపోకలు నిలిపివేత ..--24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
పాలకొల్లు: చించినాడ బ్రిడ్జిపై రోడ్డు బేరింగ్ మరమ్మతు పనుల నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6.00 గంటల నుంచి అక్టోబర్ 16వ తేదీ ఉదయం 6.00గంటల వరకు 24 గంటల పాటు అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చించినాడ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు సురక్షితంగా కొనసాగేందుకు అవసరమైన రోడ్డు బేరింగ్ మరమ్మతు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులను సజావుగా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఒకరోజు పాటు వంతెనపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తోందని వివరించారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా ఎలాంటి వాహనాలను వంతెనపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో చించినాడ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే ప్రజలు, వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలనీ, ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని సూచించారు.
ప్రజల భద్రత, వంతెనపై సురక్షిత రవాణా సౌకర్యాల మెరుగుదల కోసమే ఈ మరమ్మతు పనులు చేపడుతున్నామనీ, ప్రజలు అసౌకర్యాన్ని అర్థం చేసుకుని జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...
-
టిడ్కో గృహాల ఆవరణలో దేవినవరాత్రుల వేడుకకు ఏర్పాట్లు పాలకొల్లు: పాలకొల్లు టిడ్కో నివాస సముదాయాల్లో 98, 93, 94 బ్లాక్ ల ఆవరణలో శ్రీ శ్రీ శ్రీ ...
-
గంజాయి నిర్మూలించండి.. యువతను కాపాడండి .. నినాదంతో మార్టేరు నుండి ఆచంట వరకు బుధవారం మార్టేరు బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 8...
-
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి