ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలి


పోడూరు:

ఉపాధి కూలీలకు వెంటనే పని కల్పించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలనీ, కొత్తగా తీసుకొచ్చిన  బివి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించి  రూ. 600  వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి 2 లక్షల కోట్లు కేటాయించాలని కోరారు. పని ప్రదేశంలో మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఝాన్సీ రాణి, ఎ కిషోర్, డి రామచంద్ర రావు,ఏ సత్తిరాజు, కె పద్మ, కె రత్నరాజు, వై మంగా, కే మోహన్ రావు, కే సంతోష్ కుమారి, కె పెండ్లయ్య, తదితరులు పాల్గొని వినతిపత్రం అందజేశారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...