మార్టేరు లో వికసించిన అరుదైన బ్రహ్మకమలం

 మార్టేరు లో రిటైర్డ్ హెచ్ఎం, అడ్వకేట్ శ్రీరామకృష్ణ ఇంటి వద్ద వికసించిన బ్రహ్మ కమలం

మార్టేరు గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం అడ్వకేట్ వెలివెల శ్రీరామకృష్ణ ఇంటి పెరట్లో ఆదివారం రాత్రి అరుదైన బ్రహ్మ కమలం వికసించింది. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత గల ఈ బ్రహ్మ కమలం ఏడాదిలో ఒకసారి మాత్రమే వికసిస్తుంది. రాత్రి సమయంలో వికసించి మళ్ళీ కొద్దిసేపట్లోనే ముడుచుకుపోతుంది. శ్రీ రామకృష్ణ ఇంటి వద్ద కుండీలో కొన్ని బ్రహ్మకమలం మొక్కలు ఉన్నాయి. నెల రోజుల కిందట ఒక పుష్పం వికసించిందనీ, మళ్లీ ఈరోజు ఇంకో పువ్వు వికసించిందని శ్రీ రామకృష్ణ తెలిపారు. పవిత్రమైన బ్రహ్మ కమలం పుష్పం తమ పెరట్లో వికసించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...