పండితవిల్లూరులో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పితాని

రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే పితాని

పండితవిల్లూరు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్న ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ

పోడూరు:పోడూరు మండలం పండిత విల్లూరు గ్రామంలో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే  పితాని సత్యనారాయణ చేతుల మీదుగా ''మీభూమి -  మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో  కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకములు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతు పక్షపాతి అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. పండిత విల్లూరు గ్రామానికి సంబంధించి మొత్తం 1303 ఖాతాలకు గాను కొత్తగా ప్రింట్ అయి వచ్చిన 1215 పట్టాదారు పాస్ పుస్తకాలను  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్, మండల టీడీపీ అధ్యక్షులు రుద్రరాజు రమేష్ రాజు, మండల జనసేన అధ్యక్షులు రావి హరీష్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రరాజు రవిరాజు, ఆర్ ఐ కె రాంబాబు, విఆర్ఓ ఎస్ కుమార్, కూటమి నాయకులు, రైతులు, ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...