కాల్దరి సమీపంలో పంట పొలాల్లో సంచరిస్తున్న పెద్దపులి.. అటవీ శాఖ డ్రోన్ కెమెరాకు చిక్కిన పెద్దపులి

 పసలపూడి గ్రామంలో పంటచేలల్లో నక్కిన పెద్దపులి


తణుకు: తూర్పు, పశ్చిమగోదావరి  జిల్లాల  సరిహద్దు సమీపంలో ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో పంట పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న పెద్దపులి. పంట పొలాల మధ్య విశ్రాంతి తీసుకుంటూ అటవీశాఖ డ్రోన్ కెమెరా కు చిక్కిన పెద్దపులి. తణుకు మండలం ముద్దాపురం-కోనాల ప్రాంతం వైపు కూడా పులి వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గౌరీపట్నం రేంజ్, ఉండ్రాజవరం, తణుకు, నిడదవోలు పోలీసుల సహకారంతో పులిని అదుపులోకి తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరికైనా పులి జాడలు కనిపిస్తే రెవెన్యూ అధికారులకు గానీ, పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

భయాందోళనల్లో సమీప గ్రామాల ప్రజలు:

సాధారణంగా ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో అప్పుడప్పుడు పులులు సంచరించడం జరిగింది. గతంలో అనడు లేనివిధంగా ఉభయగోదావరి జిల్లాలో డెల్టా ప్రాంతమైన తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరించడం తీవ్ర సంచలనంగా మారింది. పెద్దపులి తిరుగుతుందన్న వార్తలతో  తణుకు, ఉండ్రాజవరం మండలాలతో పాటు పరిసర మండలాల్లోని గ్రామాల ప్రజలు  తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...